సాంకేతికతను
అభివృద్ధి చేసిన
ఇంటెల్ సంస్థను
అభినందించిన
మంత్రి కెటిఆర్
వ్యవసాయ
రంగంలోనూ ఎఐ
వినియోగానికి కృషి చేస్తామని ప్రకటన
మనతెలంగాణ/ హైదరాబాద్ : రహదారి భద్రత, ఆరోగ్య సంరక్షణకు సామాన్యులకు ఉపయోగపడేలా కృత్రిమ మేధను ఇంటెల్ సంస్థ అభివృద్ధి చేయడం అభినందనీయమని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నా రు. మంగళవారం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పా ప్యులేషన్ స్కేల్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభు త్వం ఇంటెల్ సహకారంతో కొత్తగా మూడు ప్రాజెక్టులను ప్రారంభించిం ది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ దేశంలోనే అత్యు త్తమ మైన సంస్థల్లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఒకటి అని అన్నారు. ట్రిపుల్ ఐటీ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. రోడ్ సేఫ్టీ కోసం సహాయం అందిస్తున్న ఇంటెల్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. సామాన్యులకు ఉపయోగపడే సాంకేతికతను తీసుకురావాలని ముఖ్యమం త్రి కెసిఆర్ చెబుతూ ఉంటారన్నారని గుర్తుచేశారు. వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తీసుకొస్తున్నామని చెప్పారు.