Wednesday, January 22, 2025

బిల్డింగ్‌పై నుంచి దూకి ఇఫ్లూ విద్యార్థిని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఓయూ క్యాంపస్‌లోని ఇఫ్లూలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాకు చెందిన అంజలి(22) ఇఫ్లూలో ఎం.ఏ(ఇంగ్లీష్) ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఉదయం కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ భవనం నాలుగో అంతస్థు నుంచి కిందికి దూకింది. దీంతో అంజలి అక్కడికక్కడే మృతిచెందింది.

కుటుంబ కలహాలే విద్యార్థిని ఆత్మహత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి. లేడీస్ హాస్టల్‌లో సరైన రక్షణ చర్యలు, గ్రీల్స్ లేకపోవడం వల్లే యువతి కిందపడి చనిపోయిందని ఆరోపించారు. విద్యార్థిని మృతిపట్ల సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News