Thursday, April 17, 2025

అమెరికాలో గుడ్డు ధర ఏంతంటే..?

- Advertisement -
- Advertisement -

అమెరికాలో పలు కారణాలతో ఇప్పుడు కోడి గుడ్డు ధర రేటు పెరిగింది. తెలుగు సంతతితో పాటు అమెరికాలో ఉండే వారందరికీ గుడ్డు ప్రతిరో.జూ నిత్యావసర ఆహార జాబితాలో ఉంటుంది. గుడ్డు తోనే గుడ్ మార్నింగ్‌లు సాగుతాయి. అయితే ఇటీవలి కాలంలో మరీ విచిత్రంగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత గుడ్డు ధరలు దిగిరానంటూ పెరుగుతున్నాయి. విటమిన్స్ , తెలుపు సోన లేని , కేవలం పసుపుపచ్చ గుడ్లు అనేకం మార్కెట్‌లో కళకళలాడుతూ ఉంటాయి. మార్చి నెల మధ్యలో ఓ సారి గుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. ఇప్పుడు కొంత విరామం తరువాత చేసుకోవడానికి ఆమ్లెట్ లేని స్థాయికి ధరలు చేరాయి. ఇప్పుడు ఈ అండాల ధరలు మార్కెట్‌లో డజన్ పేటికకు 6.23 డాలర్ల స్థాయికి చేరాయి. తాను చెప్పిందే బైబిల్ తన మాట చెల్లనేరాల్సిందే అనే రీతిలో సాగే ట్రంప్ ను ధిక్కరిస్తూ ఇప్పుడు గుడ్లు కోడ్ల మాదిరిగ చెట్టు ఎక్కి దిగిరానంటున్నాయి.

బర్డ్ ఫ్లూ సోకని లేదా ఇతరత్రా వైరస్‌లు అంటని శ్రేష్టమైన కోడి గుడ్డును మార్కెట్‌లో అందిస్తామని ట్రంప్ పదేపదే చెప్పారు. అయితే వీటిని బేఖాతరు చేస్తూ ధరలు పెరుగుతున్నాయి. దీనితో పౌరులు తమ ఫ్రిజ్‌లలో ఖాళీ ట్రేలు ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుడ్లకు ఇప్పుడున్న డిమాండ్ ఈస్టర్ పర్వదినం ఎప్రిల్ 20 వరకూ ఉంటుంది. తరువాత డిమాండ్ పడిపోతుంది. ధరలు తగ్గుముఖం పడుతాయని అధికారులు తెలిపారు. ఇప్పుడున్న అత్యంత శీతల వాతావరణం , హిమపాతం వంటి పరిణామాలతో సరైన వైద్యచికిత్స ఏర్పాట్లు లేని ప్రాంతాలలో గుడ్ల ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. ఇది ఇప్పుడు స్ప్రింగ్ దశ తరువాతి వేసవి, మధ్యలో వచ్చే స్వల్ప వర్షకాల సమయం తరువాత పుంజుకుంటుంది. డిమాండ్‌కు తగ్గ సరుకు అందుబాటులోకి వస్తుంది. ధరలకు కళ్లెం పడుతుందని మార్కెట్ నిపుణులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News