Monday, December 23, 2024

రేవంత్‌పై కోడిగుడ్లు వేయడం దుర్మార్గం: విహెచ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లు వేయడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో బిఆర్‌ఎస్ సభ పెడితే అక్కడ కూడా ఇలాగే చేయమంటారా? అని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ తన ఎంఎల్‌ఎలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తమపై రాళ్లు విసిరితే… ఎంపికి వెళ్తే బిఆర్‌ఎస్ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందన్నారు. ఇలాగే దాడులు చేస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా బిఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్లు, గుడ్లు, టమాటలతో దాడి చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News