Sunday, December 22, 2024

జయప్రదకు జైలుశిక్ష ఎందుకు పడిందంటే?

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆర్నెలల జైలు శిక్షను విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు తీర్పును వెలువరించింది. ఆమెతోపాటు మరో ముగ్గురికి ఈ శిక్ష ఖరారు చేసింది. అంతేకాకుండా , రూ.5000 చొప్పున ఒక్కొక్కరికి జరిమానా విధించింది. అలనాటి నటి జయప్రద చెన్నై లోని రాయపేటలో గతంలో ఓ సినిమా థియేటర్ నిర్వహించారు. చెన్నైకు చెందిన రామ్‌కుమార్, రాజబాబుతో కలిసి థియేటర్ పనులు చూసుకునేవారు.

తొలుత బాగా లాభాలు వచ్చినా, తర్వాత రాబడి తగ్గడంతో పాటు థియేటర్ మూసేశారు. ఆ సమయంలో కార్మికుల నుంచి ఈఎస్‌ఐ రూపంలో కొంత డబ్బులు వసూలు చేశారు. థియేటర్ మూసి వేయడంతో తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉండగా, వాటిని కార్మికులకు అందజేయలేదు. దీంతో కార్మికులందరూ బీమా కార్పొరేషన్ ను ఆశ్రయించారు. సదరు బీమా సంస్థ చెన్నై ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించింది. థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్‌ఐ డబ్బలను తిరిగి వారికి చెల్లించలేదని కోర్టులో పేర్కొంది.

దీన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో జయప్రద తదితరులు దాఖలు చేసిన మూడు పిటిషన్లు కొట్టివేసింది. అయితే ఆమె వాటిని కార్మికులకు తిరిగి అందిస్తామని చెప్పినా, కోర్టు అంగీకరించలేదు. ఇరు పక్షాల వాదనలు విన్న ఎగ్మోర్ న్యాయస్థానం జయప్రద సహా ముగ్గురికి ఆర్నెలల జైలుశిక్ష , 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News