Sunday, December 22, 2024

రిపబ్లిక్ డే చీఫ్‌గెస్టుగా ఈజిప్టు నేత ?

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : ఈసారి భారత గణతంత్ర దినోత్సవాలకు ఈజిప్టు దేశాధ్యక్షులు అబ్దెల్ ఫతా ఎల్ సిసి ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం ఉంది. గత నెలలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ గత నెలలో ఈజిప్టుకు వెళ్లినప్పుడు ఫతాను రిపబ్లిక్ డే ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. అయితే ఆయన రాక గురించి ఇరుదేశాల నుంచి అధికారిక నిర్థారణ కాలేదు.

అయితే ఈజిప్టు నేత భారత్‌కు చీఫ్ గెస్టుగా రావడానికి వీలుందని స్పష్టం అయింది. భారత రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఈజిప్టు దేశాధినేత ఒకరు ముఖ్య అతిధిగా రావడం ఇదే తొలిసారి అవుతుంది. కోవిడ్ మహమ్మారితో గత రెండేళ్లలో భారతదేశం ఏ విదేశీ ప్రముఖుడిని గణతంత్ర దినోత్సవాలకు చీఫ్‌గెస్టుగా పిలవలేదు. ఇప్పుడు కోవిడ్ పరిస్థితి సద్దుమణిగిన దశలో ఈసారి వేడుకలకు ఈజిప్టు నేతను ఆహ్వానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News