Friday, December 20, 2024

హెవీ-డ్యూటీ ట్రక్కులను ఆవిష్కరించిన ఐషర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విఇ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్‌కు చెందిన ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్ సుదూర రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించిన హెవీ డ్యూటీ ట్రక్కుల కొత్త శ్రేణి అయిన ఐషర్ నాన్-స్టాప్ సిరీస్‌ను విడుదల చేసింది. నాలుగు కొత్త హెవీ-డ్యూటీ ట్రక్కులను కలిగి ఉన్న ఈ నాన్ స్టాప్ సిరీస్ శక్తివంతమైన, ఇంధన- సమర్థవంతమైన ఇంజిన్‌లను కలిగి ఉంటుంది. ఐషర్ ప్రో 6019ఎక్స్‌పిటి , టిప్పర్, ఐషర్ ప్రో 6048ఎక్స్‌పి హాలేజ్ ట్రక్, ఐషర్ ప్రో 6055ఎక్స్‌పి, ఐషర్ ప్రో 6055ఎక్స్‌పి 4×2, ట్రాక్టర్ -ట్రక్కులు ఉన్నాయి. హెవీ, మీడియం, లైట్ డ్యూటీ ట్రక్కులు, బస్సులు ఐషర్ విస్తృతమైన లైనప్‌ను పూర్తి చేస్తాయి. విఇసివి ఎండి, సిఇఒ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ, కొత్త పరిశ్రమ ప్రమాణాలను నెలకొల్పే హెచ్‌డి ట్రక్కుల నాన్‌స్టాప్‌రేంజ్‌ని పరిచయం చేయడం పట్ల మేమెంతో సంతోషిస్తున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News