Monday, December 23, 2024

జలమండలిలో ఘనంగా ఈద్ మిలాప్

- Advertisement -
- Advertisement -

Eid Milap celebrated in Water Board

హైదరాబాద్: జలమండలి కార్యాలయంలో బుధవారం ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా జరిగింది. హెచ్‌ఎండబ్లూఎస్‌ఎస్‌బీ మైనార్టీ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి మలక్‌పేట ఎమ్మెల్యే ఆహ్మద్ బిన్ అబ్దులా బలాలా, జలమండలి ఎండీ దానకిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, బోర్డు ఉద్యోగులు అన్ని మతాల పండుగలను కలిసికట్టుగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో జలమండలి ఈడీ డా. సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవనాయుడు, ఆపరేషన్స్ డైరెక్టర్ ఆజ్మీరా కృష్ణ, వాటర్ వర్క్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షులు రాంబాబు యాదవ్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News