Monday, January 20, 2025

ఇస్లాంపై నమ్మకం ఉన్నవారందరికీ ఈద్ ముబారక్

- Advertisement -
- Advertisement -

జనసేన అధినేత పవన కళ్యాణ్

హైదరాబాద్: దేశంలోనూ ప్రపంచమంతటా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటు ఇస్లాంపై నమ్మకం ఉన్నవారందరికీ నా తరపున , జనసేన తరపును ఈద్ ముబారక్ అంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట ధర్మాచరణ, దానధర్మాలు , ఉపవాస దీక్షలతో పవిత్ర రంజాన్ మాసం ముగిసి ఈదుల్ ఫితర్‌ను భక్తి శ్రద్దలతో జరుపుకొంటున్న వారందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు చెబుతున్నట్టు తెలిపారు.

రంజాన్ పండుగ సందర్భంలో దేశంలో మత సామరస్యం వెల్లివిరుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదన్నారు. ఇఫ్తార్ విందులో ముస్లింలతోపాటు ఇతర మతస్తులు అధికంగా పాల్గొనడం మనదేశంలోనే ఎక్కువగా చూస్తామని పవన్‌కళ్యాణ్ ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News