Saturday, September 28, 2024

బక్రీద్ కు  సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

అర్ధ చంద్రకార నెలవంక జూన్ 7న కనిపిస్తే బక్రీద్ పండుగ జూన్ 17న లేకుంటే జూన్ 18న జరుగనున్నది.

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు చేసుకునే బక్రీద్ పండుగ సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగ జూన్ 17న ప్రకటించింది. అయితే అర్ధచంద్రాకార నెలవంక దర్శనంపైనే పండుగ తేదీ నిర్ధారణ కానున్నది. నెలవంక జూన్ 7న కనిపిస్తే బక్రీద్ జూన్ 17 ఉంటుంది. లేకుంటే జూన్ 18న ఉంటుంది.

బక్రీద్ పండుగకు ముందే వివిధ దుకాణాలలో అమ్మకాలు ఊపందుకున్నాయి. బక్రీద్ కు ముందే పశు వర్తకులు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, యూపీ, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. వారంతా తాత్కాలిక మార్కెట్లలో తమ జీవాలను అమ్ముతున్నారు.

బక్రీద్ పండుగకు సెలవు ఇవ్వడంతో పాటు జూన్ 25న వచ్చే ఈద్-ఈ-ఘదీర్ కు కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల ధుల్ హిజ్ఝా 10 రోజున బక్రీద్ పండుగ చేసకుంటారు. నాడు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు నమాజ్ చేస్తారు. గత ఏడాది ఖుర్బానీకి జంతువుల డిమాండ్ బాగా ఉండింది. నెలవంక దర్శనం మీద బక్రీద్ ఏ రోజనేది ఆధారపడి ఉంటుంది కనుక బక్రీద్ పండుగ రోజును అటుయిటుగా తెలంగాణ ప్రభుత్వం మార్చే అవకాశం కూడా ఉంది. ముస్లింలు బక్రీద్ ను ‘ఈద్ అల్-అధా’ అని కూడా పిలుస్తారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News