Friday, March 14, 2025

తిరుమల ఆలయంపై 8 విమానాల చక్కర్లు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాలు మరోసారి చెక్కర్లు కొట్టాయి. గురువారం ఒక్కరోజే ఆలయ సమీపంలో ఎనిమిది విమానాలు తిరిగాయి. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అలా జరిగిగే ఆపద వస్తుందని పండితులు చెబుతారు. దీనిపై టిటిడి పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ.. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఎంతో ఖ్యాతి ఉన్న తిరుమల ఆలయంపై విమానాలు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం 7.15 నుంచి 8 గంటల మధ్యలో ఎనిమిది విమానాలు వెళ్లడాన్ని భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News