Monday, December 23, 2024

దుర్గా నిమజ్జనంలో విషాదం…. 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Eight drown in flash floods during Durga immersion

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయ్‌గురిలో విషాదం చోటుచేసుకుంది. మాల్ నదిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా భారీ వరదలో 8 మంది గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వేలాది మంది భక్తులు మాల్ నదిలో అమ్మవారు విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. ఒక్కసారిగా భారీ వర్షాలు పడడంతో సిక్కిం రాష్ట్రం నుంచి భారీ వరద రావడంతో 40 మంది భక్తులు నదిలో చిక్కుకపోయారని జిల్లా మేజిస్ట్రేట్ మౌమితా గోదారా బసు తెలిపాడు.  భారీ వరద ప్రవాహం ఉండడంతో మాల్ నది పరిసర ప్రాంతాలలో ఎవరు అమ్మవారు విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News