న్యూఢిల్లీ :ఐపిఎల్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) విదేశీ క్రికెటర్లను వారి వారి సొంత దేశాలకు పంపించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఐపిఎల్‌కు ప్రాతినిథ్యం వహించిన 8 మంది ఇంగ్లండ్ క్రికెటర్లను బుధవారం ప్రత్యేక ప్రత్యేక విమానంలో వారి దేశానికి పంపించింది. ఈ సీజన్‌లో ఇంగ్లండ్‌కు చెందిన మొత్తం 11 మంది క్రికెటర్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. తొలి విడతగా 8 మంది క్రికెటర్లను ఇంగ్లండ్‌ను పంపించేందుకు బిసిసిఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం 8 మంది ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు బయలుదేరి ఉన్నారు. వీరిలో శామ్ కరన్, టామ్ కరన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, శామ్ బిల్లింగ్స్, జాసన్ రాయ్, జానీ బెయిర్‌సటో, జోస్ బట్లర్‌లు ఉన్నారు. ఇక ఇయాన్ మోర్గాన్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ మలాన్‌లు కూడా మరో రెండు రోజుల్లో ఇంగ్లండ్ బయలుదేరి వెళుతారు.
Eight England Cricketers Return Home