Friday, December 20, 2024

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా: ఎనిమిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

Eight Killed After Bus Overturns In Karnataka

తుమకూరు: కర్నాటకలోని తుమకూరు జిల్లా పావగడ సమీపంలో శనివారం ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఎనిమిది  మంది మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వైఎస్ హెచ్ కోట నుంచి పావగడకు వెళ్తుండగా బస్సు ఎపి-కర్నాటక సరిహద్దులోని పల్లవహళ్లి కట్ట వద్ద బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ట్వీట్‌లో “కర్ణాటకలోని తుమకూరులో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం విని తీవ్ర వేదన చెందాను. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News