- Advertisement -
గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులలో కనీసం ఎనిమిది మంది మృతి చెందారని పాలస్తీనా మెడికోలు తెలిపారు. చనిపోయిన వారిలో డ్రోన్ ఆపరేట్ చేసిన ఓ స్థానిక రిపోర్టర్ కూడా ఉన్నాడు. ఉత్తరాది పట్టణం బీత్ లహియా ప్రాంతంలో శనివారం జరిగిన దాడుల నుంచి ఎనిమిది మృత దేహాలు అందాయని ఇండోనేషియా హాస్పిటల్ వెల్లడించింది. ఉత్తర గాజాలో ఎమర్జెన్సీ సర్వీసెస్ హెడ్ అయిన ఫరేస్ అవద్ ‘చనిపోయిన వారిలో ఒకరు స్థానిక రిపోర్టర్ మహమూద్ ఇస్లిమ్ ఉన్నారు. ఆయన డ్రోన్‌ను ఆపరేట్ చేశాడు’ అని పేర్కొన్నారు.
- Advertisement -