Monday, December 23, 2024

అమెరికాలో అగ్నిప్రమాదం: ఎనిమిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

Eight killed in Oklahoma house fire accident

వాషింగ్టన్ : అమెరికా లోని ఓక్లహోమా లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 1నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు చిన్నారులు ఉన్నారు. బ్రోకెన్‌యూరో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 4 నాలుగు గంటలకు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసినా ఇంట్లోని వారి ప్రాణాలను కాపడలేక పోయారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇంటి వెనుక భాగంలో ఉన్న గదిలో మంటలు చెలరేగి ఇంటికి వ్యాపించినట్టుగా భావిస్తున్నారు. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాతే ప్రమాదానికి కారణాలు తెలుస్తాయని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఇదే ఇంటి నుంచి పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News