Wednesday, January 22, 2025

యుపి రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Eight killed in road accident at UP Kasganj

కస్‌గంజ్(యుపి): ఇక్కడి పటియాలి ప్రాంతంలో మంగళవారం ఒక టెంపోను ఎదురుగా వస్తున్న ఎస్‌యువి ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించగా మరో ఆరుగురు గాయపడ్డారు. బుదోన్ మెయిన్‌పురి హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక సత్సంగ్(మత సమావేశం)లో పాల్గొనేందుకు ప్రయాణికులతో వెళుతున్న టెంపోను ఎదురుగా వస్తున్న ఎస్‌యువి ఢీకొంది. ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించిన యోగి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News