Tuesday, December 24, 2024

హర్యానాలో రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : హర్యానా లోని జింద్ జిల్లా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్ర రవాణా బస్సు , కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. బీదీపూర్ గ్రామ సమీపాన జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళతోసహా మొత్తం ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురిని రోహ్‌తక్ లోని పిజిఐఎంఎస్ ఆస్పత్రికి తరలించామని, మరో ఇద్దరికి జింద్ ఆస్పత్రిలో చికిత్స అందిందని సాదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ కుమార్ చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News