Thursday, January 23, 2025

ఛత్తీస్‌గఢ్‌లో మరో 8 మంది మావోయిస్టుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : గత నెల ఏప్రిల్ 26న దంతెవాడ జిల్లా అర్నాపూర్ వద్ద మావోయిస్టులు జరిపిన పేలుళ్లలో 10 మంది పోలీస్‌లు ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరో 8 మంది మావోయిస్టులను పోలీస్‌లు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక మైనర్ ఉన్నాడు. ఆ మైనర్‌ను జ్యువెనైల్ హోమ్‌కు తరలించారు. దీంతో మొత్తం 17 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.

అర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం పోలీస్‌లు తనిఖీలు చేపట్టినప్పుడు ఈ అరెస్టులు జరిగాయి. మొదట ముగ్గురి మైనర్లను అదుపు లోకి తీసుకుని విచారించగా, దీనివెనుక ఉన్న వారి పాత్ర బయటపడింది. అనంతరం మిగతా వారిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News