ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా, గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య శనివారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గంగలూరు అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల పక్కా సమాచారంతో బీజాపూర్ నుంచి డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్, కోబ్రా 252, సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ సిబ్బందితో కూడిన బృందం ఇక్కడ అడవుల్లో ఆపరేషన్‌కు బయలుదేరి వెళ్ళాయి. ఈ సమయంలో భద్రత బలగాలపై మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో
ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన ప్రాంతం నుంచి ఇన్సాస్ రైఫిల్, బిజిఎల్‌తో సహా పెద్దఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని బస్తర్ ఐజి సుందర్ రాజ్ ధ్రువీకరించారు. పది రోజుల క్రితం గరియాబంద్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి తో పాటు 16 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగిన రోజుల వ్యవధిలోనే తాజాగా మరో ఎనిమిది మంది