Wednesday, January 22, 2025

రక్తమోడిన రహదారులు: ఎనిమిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

Eight Members dead in Different road accidents

 

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మృతి చెందారు. తిరుపతిలోని చంద్రగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలో చనిపోయారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కాణిపాకానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో ఒక టీచర్ చనిపోయాడు. ఈ మార్గంలో మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయం దగ్గర కారు బీభత్సం సృష్టించింది. గేటును ఢీకొట్టిన అనంతరం భక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News