వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల మోత కలకలం సృష్టించింది. కాలిఫోర్నియాలోని శాన్ జోన్ ప్రాంతం పబ్లిక్ ట్రాన్సిట్ మెయింటెన్స్ యార్డ్ లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పులో నిందితుడు సైతం కూడా చనిపోయాడు. కంపౌండ్ లోపల పేలుడు పదార్థాలు ఉండడంతో బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు జరిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారి రస్సెల్ డెవిస్ తెలిపారు. మృతులంతా ఒకే కంపెనీ చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై వైట్ హౌస్ డిప్యూటి ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ ఫియెర్ విచారం వ్యక్తం చేశారు. గన్ కల్చర్ అనే అంటువ్యాధితో అమెరికా బాధపడుతోందన్నారు. యూనియన్ సమావేశం జరుగుతుండగా కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని శాన్‌జోస్ మేయర్ సామ్ లిక్కార్డో తెలిపారు.
అమెరికాలో కాల్పుల కలకలం… 8 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -