హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా కూతవేటు దూరంలో ఉన్న రూబీ వేర్ లాడ్జీలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక 8 మంది చనిపోయారు. ముగ్గురు ఘటనా స్థలంలో దుర్మరణం చెందగా మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులు సీతారామన్(చెన్నై), వీతేంద్ర(ఢిల్లీ), హరీష్(విజయవాడ) మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, అండర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన షోరూమ్ ఉంది. షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి తోడు దట్టమైన పొగలు అలుముకోవడంతో గదులలో ఉన్నవారు స్పృహ తప్పి కిందపడిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో కొందరు భవనం పైనుంచి కిందకు దూకారు. గాయపడిన పది మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లాడ్జిలో దాదాపుగా 23 గదులుండగా 25 పర్యాటకులు ఉన్నట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంఎల్ఎ సాయన్న ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం: 8 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -