- Advertisement -
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కనకయ్య, ప్రకాశ్ అనే ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పేలుడు సంభవించిన వెంటనే కార్మికులు బయటకు పరుగులు తీశారు. కంపెనీ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్ మోగించి అలెర్ట్ ప్రకటించింది. కంపెనీ లోపల ఎవరైనా చిక్కుకున్నారా? అనే దానిపై ఇంకా సమాచారం లేదు.
- Advertisement -