Friday, December 20, 2024

గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఎనిమిది ఎంఎంటిఎస్ ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎనిమిది ఎంఎంటిఎస్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు వెల్లడించింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:  హైదరాబాద్- టు లింగంపల్లి (జిహెచ్‌ఎల్-5), సికింద్రాబాద్- టు హైదరాబాద్ (జిఎస్‌హెచ్ 1) సెప్టెంబర్ 28వ తేదీన, లింగంపల్లి- టు ఫలక్‌నుమా (జిఎల్‌ఎఫ్ -6), హైదరాబాద్- టు లింగంపల్లి (జిహెచ్‌ఎల్- -2), లింగంపల్లి- టుహైదరాబాద్ (జిఎల్‌ఎఫ్3) రైళ్లను నడుపనున్నట్టు అధికారులు తెలిపారు. వీటితో పాటు ఫలక్‌నుమా -టు సికింద్రాబాద్ (జిఎఫ్‌ఎస్-7), హైదరాబాద్ టు- సికింద్రాబాద్ (జిహెచ్‌ఎస్-4), సికింద్రాబాద్ -టు హైదరాబాద్ (జిఎస్‌హెచ్ -8) రైళ్లను సెప్టెంబర్ 29వ తేదీ వరకు నడుపనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News