Sunday, January 19, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎనిమిది మంది నక్సల్స్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఎనిమిది మంది నక్సల్స్ పోలీస్, సిఆర్‌పిఎఫ్ అధికారుల ముందు ఆదివారం లొంగిపోయారని పోలీస్‌లు తెలిపారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరిలో ఉమెన్ క్యాడర్ వెట్టి మాసె (42), మావోయిస్ట్ మలన్‌గిరి ఏరియా కమిటీలో ప్లాటూన్ నెం. 24లో చురుకైన పాత్ర వహిస్తోంది. ఈమెపై రూ. 2 లక్షల అవార్డు ఉంది. మిగతా మూడు కేడర్లలో సాగర్ అలియాస్ దేవ మాడ్కమ్ (31), పొడియం నాండే (30), సోధి తులసీ (32), వీరిలో ఒక్కొక్కరిపై రూ. లక్ష వంతున అవార్డు ఉంది.

వీరంతా రోడ్లు గండి కొట్టడం, మావోయిస్ట్ కరపత్రాలు పంచడం, పోస్టర్లు అంటించడం, సెక్యూరిటీ సిబ్బందిపై రెక్కీ నిర్వహించడం, అక్రమంగా మావోయిస్టుల కోసం విరాళాలు సేకరించడం తదితర పనులు చేసేవారు. గిరిజనులపై మావోయిస్టులు సాగిస్తున్న అరాచకాలకు , శుష్క మావో సిద్ధాంతాలకు విరక్తి చెందామని, రాష్ట్ర ప్రభుత్వ నక్సల్ నిర్మూలన విధానం, సుక్మా పోలీస్ పునరావాస డ్రైవ్ (నవోదయం)ఆకర్షించి తాము లొంగిపోయామని వారు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News