న్యూఢిల్లీ: ఢిల్లీలోని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. బాత్రా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఎనిమిది మంది కోవిడ్ రోగులు శనివారం మృతి చెందినట్టు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. కరోనా రోగుల వివరాలను సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఆస్పత్రి ఈ వివరాలను న్యాయస్థానానికి వివరించింది. ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం వల్ల ఎనిమిది మంది రోగులు మరణించారని కోర్టుకు తెలిపిన యాజమాన్యం ఆస్పత్రిలో గంటన్నరకు పైగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోందని తెలిపింది. ప్రాణవాయువు లేక వైద్యుడు సహా ఎనిమిది మంది రోగులు చనిపోయారని వివరించింది. ఉదయం 11.45 గంటలకు ఆక్సిజన్ అయిపోయింది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆక్సిజన్ వచ్చింది. రెండవ ట్యాంకర్ సాయంత్రం 4 గంటలకు చేరుకుంది. తాము 1 గంట 20 నిమిషాలు ఆక్సిజన్ లేకుండా ఉన్నామని ఆసుపత్రి కోర్టుకు తెలిపింది. బాత్రా హాస్పిటల్ లో ఆక్సిజన్ అయిపోవడం వారంలో ఇది రెండోసారని అధికారులు తెలిపారు.
Eight patients died of oxygen shortage at Batra Hospital