Sunday, December 22, 2024

చెరువు లోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ లోని బల్‌రామ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెరువు లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8  మంది ప్రాణాలు కోల్పోయారు. బుధబాగిచా ప్రాంతం నుంచి సూరజ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికులు, పోలీస్ సిబ్బంది సహాయంతో చెరువులో ఉన్న వాహనాన్ని బయటకు తీశారు. వాహనం లోనే ఆరుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని పోలీస్‌లు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News