Monday, January 20, 2025

పిల్లల నిద్ర చెడగొట్టకు అన్నందుకు అమెరికాలో ఎనిమిది మంది కాల్చివేత

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : పిల్లలు నిద్రపోతున్నారు, అర్థరాత్రి ఈ కాల్పుల చప్పుళ్లు ఏమిటని అడిగిన పాపానికి అమెరికాలోని టెక్సాస్‌లో ఓ సాయుధుడు పొరుగింటికి చెందిన ఐదుగురిని కాల్చిచంపాడు. మృతులలో ఓ ఎనిమిదేళ్ల బాబు కూడా ఉన్నాడు. దుండగుడు తన వద్ద ఉన్న ఎఆర్ 15 తరహా గన్ తీసుకుని ఇంటిబయట గాలిలోకి కాల్పులు జరుపుతూ ఉండటంతో పక్కింటివారు వచ్చి అభ్యంతరం చెప్పారని, దీనికి బదులుగా ఈ వ్యక్తి వారి ఇంట్లోకి చొరబడి కన్పించిన వారందరిపైనా కాల్పులు జరిపి పారిపోయినట్లు వెల్లడైంది. సాన్ జాసింటోలో ఈ ఘటన జరిగింది.

ఇక్కడి షెరీప్ గ్రెగ్ క్యాపెర్స్ ఇదో దారుణ ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదో ఊచకోత ఘటన మాదిరిగా ఉండదన్నారు. పక్కింటి వ్యక్తి తమను వేధించుకుతింటున్నాడని స్ధానిక పోలీసులకు ముందుగా ఫోన్ సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకునేలోగానే ఈ వ్యక్తి అఘాయిత్యానికి దిగి ప్రాణాలు తీసినట్లు వెల్లడైంది. బాధితులు ఎనిమిది సంవత్సరాల నుంచి 40 ఏళ్లలోపు మధ్యలో ఉన్నవారు. ఆగంతకుడు బాగా తాగి ఉన్నట్లు ఈ ఇంటిలోకి దూసుకువచ్చి చివరికి బెడ్‌రూం వరకూ పోయి కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. లోపలి గదులలో ఇద్దరు మహిళలు వారి పసికందులు ఇద్దరు కనపడకుందా మంచాల కింద ఉండటంతో బతికి బయటపడ్డట్లు వెల్లడైంది. ఈ మహిళలు తమ బిడ్డలను దుండగుడి నుంచి కాపాడేందుకు ఏకంగా బిడ్డలను కనపడకుండా చేసేందుకు వారిపై ఒదిగి పడుకున్నట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News