Thursday, January 23, 2025

కొలంబియాలో బాంబు దాడి: 8 మంది పోలీసులు మృతి

- Advertisement -
- Advertisement -

బోగోటా: కొలంబియాలో బాంబు దాడి జరిగింది. పోలీసులపై బాంబు దాడి జరగడంతో ఎనిమిది భద్రతా సిబ్బంది ఘటనా స్థలంలోనే చిపోయిన సంఘటన హయిలా ప్రాంతంలోని సన్ లూయిస్‌లో జరిగింది. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గ్యాస్టావో పెట్రో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు మనోదైర్యం ఇవ్వాలన్నారు. 2019లో కారు బాంబు దాడిలో 22 మంది చనిపోయారు. ఎఫ్‌ఎౠర్‌సి తీవ్రవాద సంస్థ దాడి చేసి ఉండొచ్చిన స్థానిక మీడియా అనుమానం వ్యక్తం చేసింది. గత కొంత కాలంగా ప్రభుత్వానికి లెఫ్ట్ రెబల్స్, రైట్ వింగ్ దళాలు, డ్రగ్ మాఫియాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. 1985 నుంచి 2018 మధ్య కాలంలో జరిగిన ఘర్షణల్లో దాదాపుగా 4.5 లక్షల మంది మృత్యువాతపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News