Sunday, January 19, 2025

ప్రయాణికుల రద్దీ మేరకు ఎనిమిది ప్రత్యేక రైళ్ల పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శనివారం శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ మేరకు ఎనిమిది ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. రాబోయే పండుగల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్- కటక్ (రైలు నెం.07165) ఆగష్టు 1 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు, కటక్ టు హైదరాబాద్ (07166) ఆగష్టు 2 నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు పొడిగించింది. తిరుపతి -టు జాల్నా (07413) ఆగష్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు, జల్నా -టు తిరుపతి (07414) ఆగష్టు 6వ తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. జల్నా -టు చాప్రా (07651) రైలు ఆగష్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు, చాప్రా టు -జల్నా (07652) ఆగష్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు నడుస్తుందని తెలిపింది. హైదరాబాద్ -టు గోరక్‌పూర్(02575) ఆగష్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు, గోరక్‌పూర్ టు – హైదరాబాద్ (02576) ఆగష్టు 6వ తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు నడువనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News