Monday, December 23, 2024

సైబరాబాద్‌లో ఎనిమిది మంది ఎస్సైలు బదిలీ

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఎనిమిది మంది ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే ఆయా స్థానాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఎస్‌బిలో పనిచేస్తున్న రవికిరణ్‌ను నార్సింగి పిఎస్‌కు, షీటీమ్స్‌లో పనిచేస్తున్న కిషన్‌సింగ్‌ను మొయినాబాద్, సిసిఎస్ రాజేంద్రనగర్‌లో పనిచేస్తున్న లింగంను అత్తాపూర్, కూకట్‌పల్లి పిఎస్‌లో పనిచేస్తున్న దేవరాజ్‌ను అల్లాపూర్‌కు, జీడిమెట్లలో పనిచేస్తున్న విట్టల్ రెడ్డిని జగద్గిరిగుట్ట పిఎస్‌కు, మొయినాబాద్‌లో పనిచేస్తున్న ప్రణయ్ తేజ్‌ను రాయదుర్గం పిఎస్‌కు, అత్తాపూర్ పిఎస్‌లో పనిచేస్తున్న నవీన్ రెడ్డిని మేడ్చెల్ పిఎస్‌కు బదిలీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News