Monday, December 23, 2024

నెల రోజుల పాటు ఎనిమిది రైళ్లు రద్దు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుపతి రైల్వేస్టేషన్ అప్‌గ్రేడేషన్, మౌలికవసతుల అభివృద్ధి పనులు జరుగుతుండటంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ద.మ రైల్వే ప్రకటించింది. కాజీపేట, చెన్నై, అరక్కోణం నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే ఎనిమిది రైళ్ల రాకపోకలను పలు తేదీల్లో దాదాపు నె ల రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అలా గే, హైదరాబాద్, కడప, విశాఖ పట్నం, పుదుచ్చేరి, చెన్నై సెంట్ర ల్, చామరాజనగర్, రామేశ్వరం, కదిరిదేవరపల్లి, గుంతకల్,

హుబ్లీ, విల్లుపురం, పూర్ణ, భువనేశ్వర్, హావా నుంచి తిరుపతికి రాకపోక లు సాగించే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు అధికారు లు తెలిపారు. అలాగే, కాచిగూడ-, మధురై, తిరువనంతపురం- హజ్ర త్ నిజాముద్దీన్, ఎర్నాకుళం, -హజ్రత్ నిజాముద్దీన్, హతియా, -బెంగళూరు వెళ్లే పలు రైళ్లను మెల్ప క్కం వద్ద దారి మళ్లీంచనున్నట్టు అధికారులు తెలిపారు.

Also Read: ఫిల్టర్ ఇసుక గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News