Monday, January 20, 2025

వృద్ధులను పోషించకపోతే చర్యలు

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : వృద్దాప్యములోఉన్న తల్లిదండ్రులను, వృద్ధులను పోషించకపోతే సీనియర్ సిటిజన్స్ ఆక్ట్ ప్రకారం చర్యలుంటాయని కారెపల్లి ఎస్ ఐ పుష్పాల రామారావు ఆన్నారు. గురువారం జైత్రం తండ కు చెందిన దివ్యంగ వృద్ధుడైన ధారావత్ సూర్య (65) తనకు కాలు,చెయి లేదని తన భూమి కుమారులు పంచుకొని పోషణ చూడటము లేదని ఫొన్ ద్వారా కరెపల్లి ఎస్‌ఐ కు ఫిర్యాదు చేయడంతో ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామస్తుల సమక్షంలో సుర్య కుమారులైన రమేశ్ ,నరేశ్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆస్తులు పంచుకొని వృద్దాప్యములో వారి ఆలనా పాలనా చూడకపోతే సినియర్ సిటిజన్స్ మెయింటనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆక్ట్ ప్రకారం రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు.

తల్లిదండ్రుల పోషణ పిల్లల నైతిక బాధ్యత అని, దానిని విస్మరించి హీనులుగా బ్రతకొద్దని వారికి హితవు పలికారు. అదే విధంగా చీమలపాడు కు చెందిన కల్లోజి అచ్చమ్మ అనే వృద్ధురాలిని తన మనవరాలు వివాహిత ఐన ఎజ్జు ప్రశాంతి తన ఇంట్లో ఉండనివ్వడం లేదని సరిగ చూసుకోవడం లేదనీ తెలపడముతో గ్రామస్తుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ లో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News