Thursday, January 16, 2025

ఏక్ చౌకీదార్.. దూస్రా దుకాణ్‌దార్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ముస్లింలపై జరుగుతున్న అణచివేతలపై ప్రధాని మోడీ కానీ, రాహుల్ గాంధీ కానీ మాట్లాడడం లేదని, వీరిలో ఒకరు చౌకీదార్ అయితే , మరొకరు దుకాణ్‌దార్‌గా వారిని పోలుస్తూ ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తేహదుల్ ముస్లిమీన్ ( ఎఐఎంఐఎం)చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. ఆజ్‌తక్ జి 20 గోష్ఠి సందర్భంగా ఒవైసీ ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వైఖర్లపై విమరనాస్త్రాలు గుప్పించారు.

ప్రధాని మోడీ తానెప్పుడు ఏం మాట్లాడినా తనకు తాను చౌకీదారునని ,దేశంలో అవినీతిని నివారించడానికి అంకితమయ్యానని చెబుతుంటారని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడాన్ని రాహుల్ గొప్పగా విద్వేషాల బజార్ (నఫ్రత్ కీ బజార్) మూతపడిందని, దానికి బదులు ప్రేమతో కూడిన దుకాణం( మొహబత్‌కీ దుకాణే) ప్రారంభమైందని పాత్రికేయులకు చెప్పారని ఒవైసీ గుర్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News