Sunday, December 22, 2024

ఏక్ నాథ్ షిండేలు కాంగ్రెస్ లోనే ఉన్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నల్లొండ: అసెంబ్లీలో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కెటిఆర్ ప్రశ్నించారు.

‘కాంగ్రెస్ మాటల గారడీకి మోసపోయామని వంద రోజుల్లోనే ప్రజలు గ్రహించారు. రూ. 2 లక్షల రుణమాఫీ ఇంకా ఎందుకు చేయలేదు? రుణమాఫీ జరిగితేనే కాంగ్రెస్ కు ఓటేయండి. రుణమాఫీ రాకుండా మోసపోతే మటుకు భారత రాష్ట్ర సమితికి ఓటేయండి. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. నల్గొండ, ఖమ్మం నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారు. ఏక్ నాథ్ షిండేలు కాంగ్రెస్ లోనే ఉన్నారు’ అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News