యాదాద్రి భువనగిరి:శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షే త్రంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామిఅమ్మవార్లకు వైభవంగా లక్ష పుష్పార్చన పూజను నిర్వహించారు. శనివారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదర్శన నారసింహ హోమం పూజలతో భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు.
ఏకాదశి పురస్కరించుకొని ఆలయ ముఖమండపంలో శ్రీలక్ష్మీనరసిం హ స్వామి వారికి అలంకరించిన రంగురంగుల పరిమళముగల వివిధ రకాల పుష్పాలతో వైభవంగా లక్ష పుష్పార్చన పూ జను అర్చకులు నిర్వహించారు. శ్రీవారి పుష్పార్చనలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.
ఆలయ నిత్యపూజలో భక్తులు..
శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో వేదోక్తంగా నిత్యపూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి కుటు ంబ సభ్యులతో, పిల్లాపాపలతో కలిసి వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనరసింహుని దర్శనముతో పాటు, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, వెండి జోడి సేవ, శ్రీసత్యనారాయణ వ్రతపూజలలో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.
కొండపైన అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధినీ సమేత శ్రీరామాలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనము చేసుకొని పూ జలు నిర్వహించారు. కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడ భక్తులు సందర్శించి ఆలయ నిత్యపూజలలో పాల్గొని శ్రీవారి దర్శించుకున్నారు.
ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగం గా శనివారం రూ. 19,69,244 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.6,30,850, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,02,200, బ్రేక్ దర్శనం ద్వారా రూ.2,22,900, వీఐపీ దర్శనం ద్వారా రూ.1,50,000, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.3,50,000, తదితర శాఖల నుండి ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
స్వామివారి గోపురం బంగారు తాపడానికి విరాళం..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయ విమాన గోపురం బంగా రు తాపడానికి యాదగిరిగుట్టకు చెందిన బెలిదె భాస్కర్ గుప్త దంపతులు రూ.51,116 విరాళంగా అందజేశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు ఆలయ అధికారి గజ్వేల్ రఘుకు బంగారు తాపడం విరాళాన్ని అందజేశారు.