Thursday, January 23, 2025

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహునికి ఏకాదశి లక్ష పుష్పర్చన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామిఅమ్మవారులకు వైభవంగా లక్ష పుష్పర్చన పూజను నిర్వహించారు. శనివారము ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదార్శన నారసింహ హోమం పూజలతో భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు.ఏకాదశి పురస్కరించుకొని ఆలయ ముఖమండపంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి అలంకరించి రంగు రంగుల పరిమలముగల వివిధ రకముల పుష్పలతో వైభవంగా లక్ష పుష్పర్చన పూజలను అర్చకులు నిర్వహించారు. శ్రీస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో శాస్త్రోకక్తంగా జరిగిన నిత్యకల్యాణం,పుష్పర్చన, వేండి జోడి సేవలో పాల్గొని మోక్కుబడులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం తరలి వచ్చిన భక్తుల రద్దీ పెరిగింది.

శ్రీవారి నిత్యరాబడి..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడి రోజున 35,76,475 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో జరుగు అర్జిత సేవలు, ప్రసాద విక్రయం, ప్రధాన బూకింగ్, పాతగుట్ట ఆలయం, కొండపైకి వాహనాల అనుమతి ఇతర శాఖల నుండి శ్రీ వారి నిత్యరబాడి సమకురినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీలక్ష్మీనరసింహుని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో స్వయంబు దేవుడిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకలు మంత్రికి వేదశీర్వచనము చేయగా ఆలయ అధికారులు ప్రసాదమును అందచేశారు. ఆలయంలో జరిగిన ఏకాదశి పూజలో మంత్రి పాల్గొని దర్శించుకున్నారు. మంత్రి వెంట ప్రభుత్వవిప్ సునీత తదితరులు ఉన్నారు.

సినీనటుడు తనకెళ్ల భరణి….

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని సినీనటుడు తనకెళ్ల భరణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణం అనంతరం తొలి సారి కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయన స్వయంబు దేవుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయగా ఆలయ అర్చకులు ఆయనకు శ్రీ స్వామి వారి ఆశీర్వచనముతోపాటూ తీర్ధ ప్రసాదమును అందచేశారు. నవ ఆలయాని తిరిగి చూసిన తనకెళ్ల భరణి ఆలయ నిర్మాణం బాగుందని శ్రీ స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టముగా బావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News