ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకేబినెట్ విస్తరణ పూర్తయ్యింది. ముంబైలోని రాజ్‌భవన్‌లో అట్టహసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ సమక్షంలో 18 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో 9 మంది శివసేన షిండే వర్గానికి చెందినవారు.. మరో 9 మంది బిజెపికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వేడుకగా ముగిసిన ఈ కార్యక్రమంలో సిఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసిన 40 రోజుల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగింది. కాంగ్రెస్, శివసేన, ఎన్‌సిపిల సంకీర్ణ ‘మహావికాస్ అఘాడీ’ ప్రభుత్వం కూలిన అనంతరం జూన్ 30న ముఖ్యమంత్రిగా షిండే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
Maharashtra Cabinet expansion: 18 MLAs of BJP, Shinde camp take oath as ministers#ITVideo #EknathShinde #MaharashtraCabinet pic.twitter.com/wdsjMnOdIv
— IndiaToday (@IndiaToday) August 9, 2022
https://twitter.com/narendra52/status/1556882003156316161