ముంబై : బిజెపి సహాయంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడు వారాల తర్వాత, ఏక్‌నాథ్ షిండే తన డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోం, ఆర్థిక శాఖలలను అప్పగించారు.18 మంది మంత్రులను చేర్చుకోవడం ద్వారా మంగళవారం తన మంత్రివర్గాన్ని విస్తరించిన షిండే, పట్టణాభివృద్ధి శాఖను తన వద్దే ఉంచుకున్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వెలువడిన ఒక ప్రకటన ప్రకారం, దేవేంద్ర ఫడ్నవిస్ ప్రణాళిక మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తారని తెలిసింది. బిజెపి మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కొత్త రెవెన్యూ మంత్రిగా ఉంటారు. బిజెపి మంత్రి సుధీర్ ముంగంటివార్‌ను అటవీ శాఖ మంత్రిగా నియమించారు, ఇది అతను గతంలో నిర్వహించింది.రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఉన్నత , సాంకేతిక విద్యా శాఖకు కొత్త మంత్రిగా ఉన్నారు, ఆయన పార్లమెంటరీ వ్యవహారాలను కూడా చూస్తారు. శివసేన తిరుగుబాటుదారుల ఏక్‌నాథ్ షిండే వర్గం నుంచి పాఠశాల విద్యకు దీపక్ కేసర్కర్ కొత్త మంత్రి కాగా, అబ్దుల్ సత్తార్‌కు వ్యవసాయ శాఖను కేటాయించారు.