Thursday, December 26, 2024

ఎమ్మెల్యేలతో షిండే అత్యవసర భేటీ..

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మహా సీఎం కుర్చీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవి కోసం ఏక్‌నాథ్ శిండే, దేవంద్ర ఫడ్నవీస్ మధ్య పోటీ ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో సీఎం ఫడ్నవీస్ అంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. ఇదిలావుంటే.. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ శిండే తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు.

ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముంబైలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ తప్పకుండా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అత్యధిక స్థానాలు గెలువడంతో ఈసారి ఫడ్నవీసే సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్న క్రమంలో షిండే ఈ భేటీ నిర్వహించడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఎక్కువ సీట్లు వస్తే సీఎం పదవి ఇవ్వాలన్న రూల్ లేదని షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరనేది చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. మరోవైపు, సీఎం పదవిపై అజిత్ పవార్ కూడా ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఎల్లుండితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుండటంతో సీఎం పదవిపై నేడో, రేపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News