Sunday, December 22, 2024

అయోధ్యలో రామాలయ నిర్మాణం.. ప్రధాని మోడీకి షిండే ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

థానే : అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేయించి కోట్లాది మంది భారతీయుల కలలను నెరవేర్చిన ఘనత ప్రధాని మోడీ సాధించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రశంసించారు. అయోధ్యకు కాలినడకన 300 మంది భక్తులు ఆదివారం బయలుదేరిన సందర్భంగా షిండే ప్రసంగించారు. ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శ్రద్ధ, భక్తి ఫలించి రామాలయ నిర్మాణం పూర్తయిందని కొనియాడారు. శివసేన సంస్థాపకులు దివంగత బాల్ థాకరే కూడా అయోధ్యలో బ్రహ్మాండమైన రామాలయం నిర్మాణం కావాలని కలలు కనే వారని గుర్తు చేశారు. అయోధ్య నగరం మొత్తం ప్రపంచం లోనే ముఖ్యమైన యాత్రాస్థలంగా మారిందని చెప్పారు. పాదయాత్రకు బయలుదేరిన 300 మందిని అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News