- Advertisement -
ముంబై: శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో మహాయుతి ఘన విజయం సాధించాక ఆయన రాజీనామా చేశారు. షిండే మంగళవారం ఉదయం గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ కలుసుకుని తన రాజీనామాను సమర్పించారు. కాగా గవర్నర్ కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే వరకు ఆయనను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని కోరారు.
బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే మహారాష్ట్రలో ప్రధాన రాజకీయ నాయకులుగా ఉన్నారు.వారు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆశిస్తున్నారు. బిజెపి 132 సీట్లు గెలుచుకోగా, శివసేన కేవలం 57 సీట్లే గెలుచుకుంది.
- Advertisement -