Monday, January 6, 2025

వెనుకకు తగ్గిన ఏక్‌నాథ్ షిండే

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అకస్మాత్తుగా తన వైఖరి మార్చుకున్నారని, రోజుల తరబడి ముమ్మరంగా సంప్రదింపులు సాగించిన అనంతరం రానున్న మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల నిర్వహణకు ఆయన అంగీకరించినట్లు అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి. ఆ వర్గాల సమాచారం ప్రకారం, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా తిరిగి అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం (5న) ముంబయిలో అత్యున్నత స్థాయి ప్రమాణ స్వీకారోత్సవంలో ఫడ్నవీస్, ఎన్‌సిపి నేత అజిత్ పవార్‌తో కలసి షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది షిండే వైఖరిలో గణనీయమైన మార్పును సూచిస్తోంది. రెండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మహారాష్ట్రకు సారధ్యం వహించిన శివసేన అధిపతి ఫడ్నవీస్ కింద ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అంగీకరించేందుకు తొలుత విముఖంగా ఉన్నారని సమాచారం.

మహాయుతి భాగస్వామ్య పక్షాలు బిజెపి, శివసేన, ఎన్‌సిపి మధ్య మంత్రి పదవులు, మంత్రిత్వశాఖల కేటాయింపు ఆ ముగ్గురి ప్రమాణ స్వీకారం అనంతరం జరగవచ్చు. ఈ పరిణామం దృష్టా మహాయుతి కూటమిలో అంతా సవ్యంగా ఉందని, ప్రమాణ స్వీకారోత్సవం ముందు నిర్ణయించిన ప్రకారమే సాగుతుందని శివసేన నేత సంజయ్ శిర్సాట్ తెలిపారు. ‘ఆ ముగ్గురు నేతలు కూర్చుని, మాట్లాడుకున్నారు. గందరగోళం ఏమీ లేదు’ అని శిర్సాట్ చెప్పారు. మహాయుతి భాగస్వామ్య పక్షాల్లో బిజెపి హోమ్, రెవెన్యూ వంటి కీలక శాఖలతో సహా 2122 మంత్రిత్వశాఖలు పొందవచ్చు. పార్టీ స్పీకర్, శాసన మండలి చైర్మన్ పదవులను అట్టిపెట్టుకోవచ్చు. ఇక శివసేన 16 మంత్రిత్వశాఖలు అడిగింది. కానీ పట్టణ అభివృద్ధి శాఖ సహా 12 మంత్రిత్వశాఖలతో పార్టీ సరిపెట్టుకోవచ్చు. పార్టీ శాసన మండలి చైర్మన్ పదవి కోసం కూడా పోటీ పడుతోంది. పార్టీకి ఇప్పటికే డిప్యూటీ చైర్మన్ పదవి ఉంది. కాగా, ఎన్‌సిపి ఆర్థిక, డిప్యూటీ స్పీకర్ సహా 910 మంత్రిత్వశాఖలు పొందవచ్చు.

గొంతు ఇన్ఫెక్షన్; జ్వరం వల్ల ఠాణెలోని ఒక ఆసుపత్రరిలో వైద్య పరీక్షలు చేయించుకున్న షిండే రానున్న రోజుల్లో క్యాబినెట్ పదవుల ఖరారుపై చర్చలకు సారథ్యం వహిస్తారని ఆ వర్గాలు తెలియజేశాయి. కాగా, ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తరువాత ఆరోగ్యం గురించిన ప్రశ్నకు ‘నేను బాగానే ఉన్నాను’ అని షిండే సమాధానం ఇచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవం సన్నాహకాల కోసం మహారాష్ట్ర అధికారులతో షిండే సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇది ఇలా ఉండగా, బిజెపి శాసనసభా పక్షం తమ నేతను ఎన్నుకునేందుకు బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నది. ఆ సమావేశం తరువాత తమ ముఖ్యమంత్రి అభ్యర్థిపై బిజెపి లాంఛనంగా ప్రకటన చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News