Monday, December 23, 2024

అభిమానులకు షాక్‌ ఇచ్చిన ఏక్తా కపూర్‌!

- Advertisement -
- Advertisement -

ముంబై: ఏక్తా కపూర్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చింది. 2017లో ప్రారంభించిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌– ‘ఆల్ట్‌ బాలాజీ’ బాధ్యతల నుంచి ఏక్తాతో పాటు,  ఆమె తల్లి శోభా కపూర్‌ సైతం తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా ఏక్తా వెల్లడించింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆల్ట్‌ బాలాజీ ఓటీటీ కంటెంట్‌ మిగితా వాటికన్నా భిన్నంగా ఉండడంతో వరుసగా వార్తల్లోకి  ఎక్కుతున్నది.

ఈ ఓటీటీలో ప్రసారమైన ‘గందీబాత్‌’ సిరీస్‌పై వివాదం కోర్టుకు సైతం చేరింది. ‘లాకప్‌’తో పాటు పలు రియాల్టీ షోలకు మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉండగా.. ఆల్ట్‌ బాలాజీ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఒక ప్రకటనలో ఏక్తా కపూర్ తెలిపింది. ఆల్ట్‌ బాలాజీ కొత్త బృందం ఆధ్వర్యంలో నడుస్తుందని, వివేక్‌ కోకా కొత్త చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా కొనసాగుతారని ఏక్తా తెలిపింది. ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టేందుకు ఏక్తా ఈ నిర్ణయం తీసుకున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News