Tuesday, October 22, 2024

పోస్కో కేసులో ఏక్తా కపూర్ స్పష్టీకరణ

- Advertisement -
- Advertisement -

ముంబై: ‘గందీ బాత్’ అనే వెబ్ సీరీస్ లో బాలికలను అశ్లీల దృశ్యాల్లో చూయించారని ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్, అల్ట్ బాలాజీ టెలిఫిలిం లిమిటెడ్ పై పోస్కో కేసు నమోదయింది.  ముంబై పోలీసులు ఈ కేసు పెట్టారు.

బాలాజీ టెలిఫిలిం లిమిటెడ్ ఈ నేపథ్యంలో ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ‘‘ కంపెనీ మైనర్లతో అశ్లీల దృశ్యాలలో నటింపజేసిందన్నది పూర్తిగా అబద్ధం. పోస్కో చట్టం వంటి వాటన్నిటి పరిమితులకు లోబడే కంపెనీ పనిచేస్తోంది. కాగా రోజు వారి కంపెనీ వ్యవహారాలలో శోభా కపూర్ లేక ఏక్తా కపూర్ జోక్యం లేదు. వ్యవహారాలను ప్రత్యేక టీమ్ నిర్వహిస్తుంటుంది. న్యాయవ్యవస్థలో కంపెనీకి పూర్తి విశ్వాసం ఉంది. పైగా పరిశోధన అధికారులతో కూడా పూర్తిగా సహకరిస్తోంది. ప్రస్తుతం కేసు న్యాయపరిధిలో ఉంది కనుక ఎక్కువ వివరాలు చెప్పడం వీలుపడదు’’ అని పేర్కొంది.

శోభా కపూర్, ఏక్తా కపూర్ లను నేడు(అక్టోబర్ 22న ) ఫస్ట్ రౌండ్ ప్రశ్నించేందుకు పిలిచారు. అందిన సమాచారం కరెక్టుదే అవుతే వారిని అక్టోబర్ 24న కూడా ప్రశ్నించేందుకు హాజరుకమ్మన్నారు. ముంబై పోలీసు వర్గాల నుంచి ఈ సమాచారం అందింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News