Thursday, November 21, 2024

రేషన్‌ కార్డుల ఈకెవైసి గడువు జనవరి 31వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈకెవైసిని సమర్పించేందుకు జనవరి 31 వరకు గడువు పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ తెలిపారు. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్‌కార్డు ఈకెవైసి ప్రక్రియను డిసెంబర్‌తో ముగియడంతో మరోసారి ఈకెవైసి కోసం గడువు పెంచినట్లు వెల్లడించారు. ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల ఏరివేతతోపాటు, సరుకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు నో యువర్ కస్టమర్ పేరుతో రేషన్ కార్డుల పరిశీలనకు శ్రీకారం చుట్టింది. 2014 నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు రేషన్ కార్డుల్లో పేరున్నవారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నది.

గత 10 ఏళ్లుగా కార్డులో పేరు ఉన్నవారిలో ఎంతోమంది చనిపోగా, వివాహం అయినవారి పేర్లు తొలగింపు చేయలేదు. కెవైసి ద్వారా రేషన్ బియ్యం పక్కదారిపట్టకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ప్రస్తుతం రేషన్ కార్డుల్లో పేరున్నవారంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేసింది. దీంతో గత రెండు నెలలుగా రేషన్ దుకాణాల్లో డీలర్లు లబ్దిదారుల నుంచి ఆధార్ కార్డు, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 70.80 శాతం ఈకెవైసి పూర్తయిందైనట్లు అధికారులు వెల్లడించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News