ఎల్పీజి డిస్ట్రిబ్యూటర్ సంఘం అధ్యక్షుడు జగన్‌మెహన్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని డిబిటిఎల్ లబ్ధిదారులంతా తమ ఈకెవైసి సంబంధిత ఎల్పీజి డిస్ట్రిబ్యూటర్ వద్ద ఈ నెల 31వ తేదీలోపు అంతకంటే ముందే పూర్తి చేయాలని తెలంగాణ ఎల్పీజి డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌మెహన్ రావు తెలిపారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ నోటిపై చేసిందని, ప్రజల అవగాహన కోసం విస్తృత ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు.
అదే విధంగా సార్వత్రిక వేళ కేంద్ర కేబినెట్ ఉజ్వల లబ్ధిదారుల వంట గ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్నా రాయితీ గడువును పొడిగించింది. ఒక్కో సిలిండర్‌పై ప్రస్తుతం రూ. 300 సబ్సిడీ అందిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరానికి ఈ రాయితీని వర్తింపజేసింది. ఏడాదికి 12 సిలిండర్లు వరకు ఈరాయితీ లభిస్తుంది. దీంతో 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. కాగా ప్రభుత్వ ఖజానాపై రూ. 12వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు.