- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం నిధుల జమ కోసం ఈకెవైసి తప్పని సరి చేసింది. ఈకేవైసి ఉన్నవారికే ఈ పథకం కింద నిధులు జమ కానున్నాయి. ఈకేవైసి నమోదుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వరకూ గడువిచ్చింది. ఆలోపు ఈకేవైసి అనుసంధానం చేసుకున్న రైతుల బ్యాంకు ఖాతాలకే నిధులు జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హత పొందిన ప్రతి రైతుకు ఏడాదికి ఆరు వేలరూపాయలు అందజేస్తుంది. ఈ నిధులను ఒక్కో విడతకు రూ.2000చొప్పున మొత్తం మూడు విడతలుగా రైతుల ఖాతాలకు జమ చేస్తుంది. 11వ విడత కింద పిఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ మొదటి వారంలో నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
- Advertisement -