Monday, December 23, 2024

బలహీనపడుతున్న ఎల్‌నినో..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2023లో లోటు వర్షపాతాన్ని అందించిన ఎల్ నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికల్లా కనుమరుగు కాన్నాయని, దీంతో ఈ వర్షా కాలంలో పుష్కలంగా వానలు కురుస్తాయన్న ఆశలు కలుగుతున్నాయని వాతావరణ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. భూమధ్య రేఖ సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై దీని ప్రభావం ఉంటుది. కొన్ని చోట్ల అధిక వర్షాలు, మరి కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. అయితే ఇప్పటికే ఎల్‌నినో బలహీనపడడం మొదలైందని, ఆగస్టునాటికల్లా లా నినా పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని రెండు అంతర్జాతీయ వాతావరణ ఏజన్సీలు గత వారం ప్రకటించాయి. జూన్‌ఆగస్టు మధ్యలో లా నినో పరిస్థితులు మొదలు కావడం అంటే గత ఏడాదికంటే ఈ ఏడాది రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయని ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న వాతావరణ శాస్త్రజ్ఞులు అంటున్నారు.

అయితే వాతావరణ మోడల్స్ కచ్చితంగా ఉండకపోవడం అనే తలనొప్పి కారణంగా అలా జరగకపోయే ప్రమాదం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. జూన్‌జులై మధ్యలో లా నినా పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర భూశాస్త్రాల శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ అంటున్నారు.‘ఒక వేళ ఎల్‌నినో పూర్తిగా బలహీన పడకుండా తటస్థ స్థితిలో ఉన్నా ఈ ఏడాది రుతుపవనాలు గత ఏడాదికన్నా మెరుగ్గా ఉంటాయని ఆయన అంటున్నారు. దేశంలో కురిసే వర్షాల్లో 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తాయి. ఏప్రిల్‌జూన్ నాటికి ఎల్ నినో తటస్థ స్థితికి చేరుకునే అవకాశాలు 79 శాతం, జూన్‌ఆగస్టు నాటికి లా నినా ఏర్పడే అవకాశాలు 55 శాతం ఉన్నాయని అమెరికాకు చెందిన నేషనల్ ఊసియానిక్, అట్మోస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్( ఎన్‌ఓఎఎ) గత వారం పేర్కొంది. ఎల్‌నినో బలహీనపడడం మొదలైందని యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్(సి3 ఎస్) కూడా ధ్రువీకరించింది.

అయితే ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని , కొన్ని మోడల్స్ లా నినాను సూచిస్తే, మరి కొన్ని తటస్థ పరిస్థితులను సూచిస్తున్నాయని, అయితే అన్నీ కూడా ఎల్‌నినో ముగింపునే సూచిస్తున్నాయని భారత వాతావరణ విభాగంలో సీనియర్ సైంటిస్టు అయిన డి శివానంద పాయ్ అభిప్రాయపడ్డారు. ఎల్‌నినో పరిస్థితులు బలపడ్డం కారణంగా దేశంలో 2023 రుతుపవనాల సీజన్‌లో సగటుకన్నా తక్కువ వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News